గ్యారేజ్ సెట్స్ లో మహేష్ కు ఏం పని..?

mahesh babu came janatha garage sets

జనతా గ్యారేజ్ అంటూ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ రిపేర్ల షెడ్ వేయించాడు కొరటాల శివ. హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో జనతా కొబ్బరి కాయ కొట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టేదాకా అక్కడ షూట్ జరుపుకుంది. అయితే ఇక గ్యారేజ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. గ్యారేజ్ వేసిన సారధి స్టూడియోస్ లోనే మహేష్ మురుగదాస్ కు సంబందించిన సినిమా షూట్ చేయబోతున్నారట. మొన్నటిదాకా చెన్నైలో షూట్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు హైదరబాద్ షిఫ్ట్ అవుతుంది.

ఇక తారక్ చేసిన యాజిటీజ్ ప్లేస్ లోనే మహేష్ షూట్ చేస్తుండటం ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సంతోషంతో చెప్పుకుంటున్నారు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో మైండ్ సెట్ మార్చుకున్న మహేష్ అభిమానులకు ఎలాంటి సినిమా ఇవ్వాలో ఆ కసితో మురుగదాస్ సినిమా చేస్తున్నాడు. సెకండ్ షెడ్యూల్ కు గ్యాప్ ఇచ్చిన మహేష్ త్వరలోనే షెడ్యూల్ షురూ చేస్తున్నాడు. మరి గ్యారేజ్ సెంటిమెంట్ మహేష్ కు ఏ రేంజ్లో కలిసి వస్తుందో చూడాలి.

SHARE