Posted [relativedate]
ప్రస్తుతం మహేష్ చాలా కన్ఫూజన్ లో ఉన్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.తన సినిమాల విషయంలో నమ్రత సజెషన్స్ పాటిస్తూ హిట్స్ కొడుతున్న మహేష్.. ఈ సారి నమ్రత సలహాలకు కూడా సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడట. ఎన్ని టైటిల్స్ ని సెలెక్ట్ చేసినా మహేష్ మాత్రం ఒక్కదాన్ని కూడా ఫైనలైజ్ చేయలేకపోతున్నాడట.
వివరాల్లోకి వెళ్తే.. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు కనీసం సినిమా టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు. అయితే ఏజెంట్ శివ, సంభవామి, ఇంటెలిజెంట్ అనే టైటిల్స్ లో ఒకదానిని సెలెక్ట్ చేయనున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో టైటిల్ చర్చకు వచ్చింది. చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం మేరకు ఆ టైటిల్ “మర్మం” అని తెలుస్తోంది. మరి ఈ నాలుగు టైటిల్స్ లో మహేష్ ఏది సెలెక్ట్ చేస్తాడో చూడాలి.