మళ్లీ మహేష్ నిరాశనే మిగిల్చాడుగా..

0
474
mahesh babu first look in murugadoss movie postponed

Posted [relativedate]

mahesh babu first look in murugadoss movie postponedమహేష్ బాబు, మురుగదాస్  సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ సినిమా షూటింగ్ కి తప్ప మిగతా అన్నీ విషయాలకు అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొదట సంక్రాంతికి మహేష్ ఫస్ట్ లుక్ ని విడుదల చేద్దామనుకున్నారు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా అయినా రిలీజ్ అవుతుందని ఆశపడ్డారు అభిమానులు. అప్పుడు కూడా రిలీజ్ జరగలేదు.  అయితే ఉగాదికి  మహేష్ లుక్, టీజర్ రిలీజ్ కంపల్సరీ అని అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఉగాదికి కూడా మహేష్ లుక్ విడుదల కావడం లేదని తెలుస్తోంది. అందుకు చిత్రయూనిట్ కారణాలను వినిపిస్తోంది.

మ‌హేష్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెర‌కెక్కుతోందన్న విషయం తెలిసిందే. దీంతో  ఫ‌స్ట్‌ లుక్‌ ని కూడా  ఎట్ ఎ టైమ్ విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి వచ్చిన ఇబ్బంది లేదు కానీ త‌మిళ‌నాడులో మాత్రం సమస్యగా ఉందట. తమిళనాట ప‌ర‌భాషా సినిమాల రిలీజ్‌ ల‌కు కొన్ని అడ్డంకులున్నాయట. ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందుగానే  ప్ర‌భుత్వానికి ట్యాక్స్ క‌ట్టాల్సి ఉంటుందట. త‌మిళ ప్ర‌భుత్వం నుంచి స‌పోర్ట్ లేనందున ఈ సారి కూడా ఫస్ట్ లుక్ రిలీజ్  వాయిదా ప‌డే ఛాన్సుంద‌ని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.  కాగా రెండు రోజుల క్రితమే ప్రభాస్ బాహుబలి సినిమా ఆడియోతో అభిమానులకు ఉగాది కానుకనిచ్చాడు. బన్నీ డీజేకి సంబంధించిన లుక్ ని ఎప్పుడో రిలీజ్ చేశాడు. ఇక చెర్రీ కూడా తన ఫస్ట్ లుక్ ని నిన్న తన బర్త్ డే సందర్భంగా సుకుమార్ తో రిలీజ్ చేయించాడు. మరి మహేష్ మాత్రం కారణం ఏదైనా తన అభిమానులకు మళ్లీ నిరాశని మిగిల్చినట్లే.

Leave a Reply