Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు గత సంవత్సరం కాలంగా మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ చిత్రాన్ని చేస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం ఆరంభంలోనే సినిమా పూర్తి అవ్వాల్సి ఉంది. ఎప్పుడో సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రావాల్సి ఉంది. కాని షూటింగ్ ఆలస్యం అవుతూ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరకు ఈ సినిమాను మరో మూడు నెలలు ముందుకు జరిపి ఏకంగా దసరాకు విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను దర్శకుడు మురుగదాస్ విసిగిస్తున్నాడు. తాజాగా మహేష్‌బాబుకు కూడా విసుగు వచ్చినట్లుగా అనిపిస్తుంది.
‘స్పైడర్’ చిత్రాన్ని పూర్తి చేసి కొరటాల శివ చిత్రాన్ని చేయాలని భావిస్తున్న మహేష్‌బాబును దర్శకుడు మురుగదాస్ అస్సలు వదలడం లేదు. మార్చిలో నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేద్దాం అంటూ చెప్పిన మురుగదాస్ ఇప్పుడు జులై వరకు షూటింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడట. దాంతో మురుగదాస్‌పై మహేష్‌బాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. త్వరగా కానిద్దాం అంటూ మురుగదాస్‌తో మహేష్‌బాబు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. స్పైడర్ చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. ఇప్పటికే కొరటాల శివ సినిమా తేదీని కూడా ప్రకటించాడు. సంక్రాంతికి రావాలని మహేష్‌బాబు నిర్ణయించుకున్నాడు. కాని ఇంకా ‘స్పైడర్’తోనే మహేష్‌బాబుకు సరిపోతుంది. అందుకే మహేష్‌కు కూడా విసుగు వచ్చినట్లుగా తెలుస్తోంది.