Posted [relativedate]
టాలీవుడ్ ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న మహేష్ నిజంగానే రాజకుమారుడిలా ఉంటాడు.అందుకే అమ్మాయిలు అతని పేరు చెప్పగానే మెలికెలు తిరిగిపోతుంటారు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ తన ఏజ్ ని, గ్లామర్ ని చక్కగా, స్టడీగా మేన్ టేన్ చేస్తున్నాడు. దీంతో రోజురోజుకు ఈ సూపర్ స్టార్ ఏజ్ తగ్గిపోతోందా అనిపించక తప్పదు.
ఇక అసలు విషయానికొస్తే మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోని మహేష్ గెటప్ ఒకటి లీకైంది. నలభై ఏళ్ల వయసులో కూడా కాలేజ్ కుర్రాడిలా కన్పిస్తూ అమ్మాయిలకు మతి పోగొడుతున్నాడు. ఇక అబ్బాయిలకైతే మహేష్ ని ఈ లుక్ లో చూస్తే అసూయ కలగక మానదు. ఇంతమందికి నిద్రలేకుండా చేస్తున్న మహేష్ తన గ్లామర్ కోసం ఏం చేస్తున్నాడో మాత్రం సస్పెన్సే.