మహేష్ టీజర్ తో కిక్ ఎక్కిస్తాడట..!

mahesh babu movie teaser shoot

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కు సంసిద్ధమవుతుంది. తన బర్త్ డే కు ఫ్యాన్స్ కు టీజర్ పోస్టర్ తో గిఫ్ట్ ఇచ్చే మహేష్ ఈసారి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నీరస పడ్డారు. అయితే ఈ క్రమంలో మహేష్ టీజర్ కోసం మురుగదాస్ స్పెషల్ షూట్ ఏర్పాటుచేశాడట. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్ లో కొన్ని షాట్స్ మరియు టీజర్ కు అవసరమైన కొన్ని షాట్స్ ను మహేష్ తో చేయించి ఓ అద్భుతమైన టీజర్ ను వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

రీసెంట్ గా సూపర్ స్టార్ రజిని కబాలి టీజర్ తో ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశాడు దర్శకుడు పా.రంజిత్. సినిమా ఎలా ఉన్నా కబాలి టీజర్ సౌత్ సినిమాల్లోనే కాదు భారతీయ సినిమా ప్రపంచంలో ఓ రికార్డ్ సృష్టించింది. ఇక మురుగదాస్ కూడా టీజర్ కటింగ్ లో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. మరి మహేష్ సినిమాను టీజర్ తో ఎలాంటి ఇంటెన్సిటీ కలుగచేస్తాడో చూడాలి.

SHARE