ఉగాది రోజున మహేష్ ఫస్ట్ లుక్

Posted March 23, 2017

mahesh babu murugadoss movie first look release on ugadiటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో  తమిళ దర్శకుడు, నటుడు అయిన ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కానుంది అన్న ఒక్క విషయం తప్ప ఇంకే ఇతర సమాచారం తెలియదు. సినిమా స్టార్ట్ అయ్యి సంవత్సరం కావస్తున్నా సినిమాకు  సంబంధించిన ఒక్క అప్ డేట్  కూడా అందకుండా చాలా సీక్రెసీ మెయిన్ టేన్ చేస్తున్నాడు మురుగదాస్. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారికి జోష్ వచ్చే విధంగా టాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మహేష్ ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ విడుదల చేయనుందని ఆ వార్త సారాంశం.

మహేష్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ కూడా ప్రకటించనున్నాడట మురుగదాస్. ఇటీవల ఓ సినిమా వేడుకకి హాజరైన మహేష్ కూడా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఉగాది కి విడుదలయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వార్తనే కన్ఫామ్ చేశాడట మురుగదాస్.  ఆ తర్వాత వారంలోనే   ఆడియో వేడుకని కూడా నిర్వహించనున్నారట. కాగా ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ ని సెలెక్ట్ చేశారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

SHARE