మహేష్ న్యూ ఇయర్ ప్లాన్..!

Posted November 28, 2016, 7:17 am

Image result for mahesh babu with wife and childrens

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఛాన్స్ దొరికితే జాలీ ట్రిప్ వేసే మహేష్ ఈసారి న్యూ ఇయర్ షెడ్యూల్ ముందే ప్లాన్ చేసుకున్నాడు. న్యూ ఇయర్ కల్లా మహేష్ ఎక్కడుంటాడు అంటే లండన్ లో అని అంటున్నారు. క్రిస్ మస్ నాటికే మహేష్ అక్కడికి వెళ్తాడట. న్యూ ఇయర్ దాకా అక్కడ ఉండి మిగతా ప్రదేశాలను చూసుకుని వారానికి గాని వస్తారట. మొత్తం మహేష్ ఫారిన్ ట్రిప్ 10 రోజులు చేయబోతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత కొరటాల శివ మూవీ లైన్ లో ఉంది. మురుగదాస్ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది. వచ్చే నెల చివరి దాకా అక్కడే షూటింగ్ చేసుకుని వచ్చి ఆ తర్వాత తన ట్రిప్ వేయనున్నాడు మహేష్. ఇక ఫ్యాన్స్ కోసం న్యూ ఇయర్ కు ఏమన్నా గిఫ్ట్ ఇస్తాడా అంటే కష్టమే అని తెలుస్తుంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగానే మహేష్ మురుగదాస్ మూవీకి సంబందించిన టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట.

ఇక శ్రీమంతుడు కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవ్వొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన కొరటాల శివ మరోసారి ఈ సినిమా మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని చెబుతున్నాడు.