మహేష్ గ్లామర్ సీక్రెట్ తెలిసిపోయిందోచ్…

Posted [relativedate]

mahesh babu reveals his beauty secretటాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు నిజంగానే రాజకుమారుడులా  ఉంటాడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు. తన క్యూట్ లుక్స్ తో, హీరోయిజంతో  ఎవరినైనా ఇట్టే పడగొట్టే అందం అతని సొంతం. నాలుగు పదుల వయసు  దాటినా ఇప్పటికీ అదే గ్లామర్ ని, ఫిజిక్ ని మెయిన్ టేన్ చేస్తూ కాలేజ్ అమ్మాయిలకు మతి పోగొడుతున్నాడు.  ఇప్పటివరకు తన గ్లామర్ సీక్రెట్ బయట ప్రపంచానికి తెలియకుండా మెయిన్ టేన్ చేశాడు ఈ హీరో. అయితే అతని సన్నిహితులు మహేష్  గ్లామర్ సీక్రెట్ ను రివీల్ చేశారు.

మహేష్  తన ఆరోగ్యాన్ని, గ్లామర్ ని  కాపాడుకోడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడని,  ముఖ్యంగా ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లి తన బాడీకి డీటాక్సినేషన్ చేయించుకుంటాడని చెబుతున్నారు. డీటాక్సినేషన్ ద్వారా బాడీలోని  మలినాలను, వ్యర్థాలను తొలగించుకుంటాడని, ఇలా  ఏడాదికి  రెండు సార్లు డీటాక్సినేషన్ చేయించుకుంటాడని వివరించారు. కాగా మురుగదాస్ సినిమా షూటింగ్ లో బ్రేక్ రావడంతో త్వరలోనే డీటాక్సినేషన్ కోసం మలేషియా వెళుతున్నాడట. ఇంత కేర్ తీసుకుంటాడు కాబట్టే..  మహేష్ ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలా కన్పిస్తూ ఆశ్చర్యపరస్తున్నాడు.

Leave a Reply