మహేష్… మరోసారి ఆలోచించు!!

0
320
mahesh babu sambhavami movie release postponed

Posted [relativedate]

mahesh babu sambhavami movie release postponedసినిమా వాళ్లకి సెంటిమెంట్స్ ఎక్కువ. అందుకనే టాప్ హీరోలందరూ తమ సినిమాలను సంక్రాంతికో, సమ్మర్ కో, లేక దసరాకో రిలీజ్ చేసి విజయం సాధిస్తుంటారు. అప్పుడు రీలీజ్ చేస్తే సినిమా యావరేజ్ గా ఉన్నా కలెక్షన్లు మాత్రం వచ్చేస్తాయి. మహేష్ బాబు కూడా ఒకప్పుడు ఈ సెంటిమెంట్ నే  ఫాలో అయ్యేవాడు. అందుకే ఒక్కడు సినిమాని సంక్రాంతికి,  పోకిరిని వేసవికి,  దూకుడుని దసరాకూ రిలీజ్ చేశాడు. అవి  భారీ విజయాలు సాధించి,  బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు మాత్రం మహేష్  ఈ  సెంటిమెంట్ ని కాదని సంభవామి సినిమాని  జూన్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తున్నాడట.

నిజానికి ఏప్రిల్ కల్లా సినిమా కంప్లీట్ అయిపోతుంది. అయినా కానీ  సంభవామి సమ్మర్ లో రావట్లేదు.  అందుకు కారణం …  బాహుబలి-2 సినిమానే. ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.  దీంతో క్లాష్ అవడం ఇష్టం లేక సమ్మర్ హాలిడేస్ అయిపోయాక జూన్ ఎండింగ్ లో రిలీజ్ కి ప్లాన్ చేశాడట మహేష్. బాహుబలి హైప్ ని చూసి మహేష్ భయపడుతున్నాడని, అందుకే సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశాడని కొందరు సినీ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. మహేష్ తీసుకున్న ఈ  నిర్ణయాన్ని విశ్లేషకులే కాదు మహేష్ అభిమానులు కూడా తప్పుబడుతున్నారు. సెలవులన్నీ అయిపొయ్యాక సినిమా రిలీజ్ చేస్తే  సినిమాకు భారీ కలెక్షన్లు ఎలా వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మహేష్ ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవడం మంచిది.

Leave a Reply