మహేష్ ఇంట్లో జగన్ రాజకీయ చిచ్చు?

Posted [relativedate]

mahesh babu trouble because jagan giving priority to mahesh babu babai Adi Seshagiri Rao
ప్రిన్స్ మహేష్ బాబు…రాజకీయాలకి ఆమడ దూరంలో వుండే వ్యక్తి.అందుకు తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి రాజకీయ ప్రస్థానంలో తగిలిన ఎదురుదెబ్బల కారణం కావొచ్చు .కానీ ఆయన ఎంత దూరంగా వున్నా రాజకీయం మాత్రం ఆయన్ని వదిలిపెట్టడంలేదు.2014 ఎన్నికలకు కొద్దినెలల ముందు దాకా ఆయన అనుమతి లేకుండానే కాంగ్రెస్,వైసీపీ శ్రేణులు కింది స్థాయిలో మహేష్ ఫోటోలు వాడేవి.2014 ఎన్నికల కి ముందు మహేష్ బావ గల్లా జయదేవ్ కుటుంబం టీడీపీ లో చేరడం,గుంటూరు నుంచి ఎంపీ గా పోటీ చేయడంతో మహేష్ వ్యక్తిగత స్థాయిలోనే అయినా బావకు మద్దతు ఇవ్వక తప్పలేదు.ఆ తర్వాత బావ నియోజకవర్గ పరిధిలోని స్వగ్రామం బుర్రిపాలెం దత్తత తో అడపాదడపా మహేష్ పేరు రాజకీయంగా వినిపిస్తూ వుంది.

తండ్రి కృష్ణ సహజంగా వై.ఎస్ కుటుంబానికి దగ్గరగా మెసిలినవాడు కావడం అందరికీ తెలిసిందే .అందుకు భిన్నమైన నేపధ్యం వున్న టీడీపీ లో బావ జయదేవ్ చేరడం కాస్త ఇబ్బంది అయినా మహేష్ ఎలాగో దాన్ని మేనేజ్ చేస్తూ వస్తున్నాడు.అయితే కృష్ణా,గుంటూరు జిల్లాల్లో బలమైన కమ్మ నేతల అవసరాన్ని గుర్తించిన వైసీపీ అధినేత జగన్ …కృష్ణ సోదరుడు,మహేష్ బాబాయ్ అయిన ఆదిశేష గిరి రావు ని పార్టీ లో బాగా యాక్టివ్ చేస్తున్నారు.ఆయన ఎప్పటి నుంచో పార్టీలో వున్నా ఇటీవల ఆయన ప్రాధాన్యం పెరిగింది.పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో ఆదిశేషగిరిరావు ని పక్కన కూర్చోబెట్టుకుని మరీ మాట్లాడారు.దీంతో ఘట్టమనేని కుటుంబ అభిమానులు సంకటంలో పడుతున్నారు.ప్రిన్స్ మహేష్ కూడా ఈ వ్యవహారంతో ఇబ్బంది పడుతున్నారు .రాజకీయ కారణాలతో నందమూరి,మెగా కుటుంబాల్లో సమస్యలు ఇప్పుడు తమ ఫామిలీ లో మొదలయ్యే సూచనలు చూస్తే మహేష్ ఇంట జగన్ చిచ్చు రగిల్చినట్టే వుంది.

Leave a Reply