మహేష్‌ కూడా బాహుబలిపై స్పందించాడు

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

mahesh babu tweet about on bahubali 2 movie
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ స్టార్స్‌ అభినందనలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా ‘బాహుబలి 2’ సినిమాను చూసి తన స్పందనను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రీకరణలో బిజీగా ఉన్నా కూడా మహేష్‌బాబు ఈ సినిమాపై స్పందించడం అందరిని ఆకర్షించింది.

మహేష్‌బాబు ట్విట్టర్‌లో ‘బాహుబలి 2’ గురించి స్పందిస్తూ.. హ్యాట్సాఫ్‌ రాజమౌళి అండ్‌ టీం. అద్బుతమైన సినిమాను అందించిన చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేష్‌బాబు ఇతర హీరోల సినిమాల గురించి చాలా అరుదుగా స్పందిస్తాడు. ‘బాహుబలి 2’ సినిమా బాలీవుడ్‌ స్థాయి సినిమా కనుక ఈ చిత్రంపై మహేష్‌బాబు స్పందించాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌, వర్మ, నాని ఇంకా పలువురు సినీ ప్రముఖులు బాహుబలి 2పై స్పందించిన విషయం తెల్సిందే.

Leave a Reply