మరోసారి బావగారి కోసం మహేష్‌బాబు

0
468
Mahesh Babu tweeted once again for Bava.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు టాలీవుడ్‌లో ఏ స్థాయి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏదైనా సినిమా గురించి చిన్న ట్వీట్‌ చేస్తే చాలు ఆ సినిమా స్థాయి పెరిగి పోతుంది. అయితే ఇతర సినిమాల గురించి మహేష్‌బాబు అస్సలు సోషల్‌ మీడియాలో స్పందించడు. కాని అప్పుడప్పుడు తన బావ సుధీర్‌ బాబు నటించిన సినిమాలకు సంబంధించిన టీజర్‌, టైలర్‌, ఫస్ట్‌లుక్‌, రెస్పాన్స్‌ను పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి బావ సినిమా కోసం మహేష్‌బాబు ట్వీట్‌ చేశాడు.

సుధీర్‌బాబు హీరోగా శ్రీరామ్‌ ‘శమంతకమణి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌ మరియు నారా రోహిత్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జోడీగా అమైరా దస్తూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కాస్త గ్యాప్‌ తీసుకుని సుధీర్‌ బాబు ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మహేష్‌బాబు ట్విట్టర్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. మహేష్‌బాబు రిలీజ్‌ చేయడంతో ఇప్పుడు అంతా కూడా ‘శమంతకమణి’ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు. విడుదల సమయంలో కూడా మహేష్‌బాబు బావ కోసం మరో ట్వీట్‌ చేయడమో లేక ఆడియో వేడుకలో పాల్గొనడం చేయడం ఖాయం. మొత్తానికి బావ కోసం మహేష్‌బాబు బాగానే కష్టపడుతున్నాడు.

Leave a Reply