Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానంభవతి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా చాలా తక్కువ గ్యాప్‌తోనే విడుదల అయ్యాయి. అయినా కూడా ఈ సినిమా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మూడు సినిమాలు కూడా ఆ ముగ్గురు హీరోల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌లు అందుకున్నాయి. దాంతో సంక్రాంతికి ఈసారి మరింత పోటీ పెరిగే అవకాశాలున్నాయి. సంక్రాంతి సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, భారీ కలెక్షన్స్‌ను సాధిస్తుంది. అందుకే వచ్చే సంవత్సరం సంక్రాంతికి పలు చిత్రాలు విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్‌బాబు, చరణ్‌లు ఫిక్స్ అయ్యారు.
మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా దసరాకు విడుదల కాబోతుంది. ఆ చిత్రం విడుదల కాకుండానే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు ‘భరత్ అను నేను’ అనే చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యాడు. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాత కొరటాల శివ ప్రకటించాడు. ఇక తాజాగా రామ్‌చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో మహేష్‌బాబు, చరణ్‌ల మద్య పోటీ తప్పేలా లేదని అంటున్నారు. పవన్, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ కూడా సంక్రాంతికి అన్నారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతికి ఇంకా మూడు నాలుగు సినిమాలు అయినా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.