మహేష్-బాలయ్య మల్టీస్టారర్ ?

118
Spread the love

 Posted [relativedate]

mahesh balakrishna multistarrer movieనందమూరి బాలకృష్ణ – మహేష్ బాబు కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుందా.. ? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.అది కూడా  అతి త్వరలోనే అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తయ్యింది.ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ చిత్రం తర్వాత ‘శ్రీమంతుడు’తో హిట్టిచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మహేష్.ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది. ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా, ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ ఉందట. ఈ పాత్ర బాలయ్యతో నటింపజేయాలని కొరటాల భావిస్తున్నాడంట. ఇప్పటికే బాలయ్యని కలవడం.. కథ చెప్పడం.. ఓకే చేయించుకోవడం కూడా అయ్యాయని సమాచారమ్. ఇదే నిజమైతే.. ఈ మల్టీస్టారర్ పై క్రేజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here