Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, సూపర్ స్టార్ మహేష్‌బాబుల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘పోకిరి’ మరియు ‘బిజినెస్‌మన్’లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసిన విషయం తెల్సిందే. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వీరి కాంబోలో రాబోతున్న మరో సినిమా ‘జనగణమన’ అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. గత సంవత్సరం చివర్లోనే ఆ సినిమాను ప్రారంభిస్తాను అంటూ పూరి జగన్నాద్ ప్రకటించాడు. అయితే మహేష్‌బాబు వరుసగా ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో పూరికి డేట్లు ఇవ్వలేక పోతున్నాడు.
‘జనగణమన’ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మొత్తానికే ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలోనే పూరి జగన్నాధ్ జనగణమన ప్రాజెక్ట్‌పై మరోసారి స్పందించాడు. ప్రస్తుతానికి బిజీ షెడ్యూల్స్ కారణంగా వచ్చే సంవత్సరంలో మహేష్‌బాబుతో ఆ సినిమాను చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. రెండు నెలలు పూర్తిగా కేటాయించి ఆ సినిమా స్క్రిప్ట్‌ను చాలా బాగా పూరి రెడీ చేశాడట. మరో వైపు ప్రస్తుతం పూరి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత మహేష్‌బాబుతో సినిమా ఉంటుందేమో చూడాలి.