Posted [relativedate]
బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో స్పీడ్ పెంచిన మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు కాని ఆ తర్వాత చేసే కొరటాల శివ టైటిల్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. సినిమా ముహుర్తం రోజే ‘భరత్ అనే నేను’ టైటిల్ బయటకు రావడంతో అంతా దానికి ఫిక్స్ అయ్యారు. కథాబలంతోనే కమర్షియల్ గా సినిమాలు చేసే కొరటాల శివ కచ్చితంగా డిఫరెంట్ గా ఉండటం కోసమే ఈ టైటిల్ పెట్టాడని అనుకున్నారు.
ఇక టైటిల్ తెలిసిన కొద్దిరోజుల్లోనే ఆ టైటిల్ కాదని చెప్పే ప్రయత్నం చేశారు కాని ఎవరు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా నిర్మాత డివివి దానయ్య భరత్ అనే నేను టైటిల్ నే ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాడట. సో ఇక ఇప్పటిదాకా డౌట్ గా అనుకున్నా ఇప్పుడు మాత్రం కన్ఫాం అని చెప్పేయొచ్చు. సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ కనిపిస్తాడని ఆ క్రమంలోనే ప్రమాణ స్వీకారం చేసేప్పుడు ‘భరత్ అనే నేను’ అనేది పర్ఫెక్ట్ అని టైటిల్ పెట్టబోతున్నారట.
ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న కొరటాల శివ మహేష్ మూవీ ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్ కోసం నెల పాటు అహ్మదాబాద్ లోనే షెడ్యూల్ వేసుకున్నారు.