సూపర్ స్టార్ మహేష్ ‘ వాస్కోడిగామా’ గా రాబోతున్నాడు.ఈ మూవీని తమిళ టాప్ డైరెక్టర్ మురగదాస్ డైరెక్ట్ చెయ్య బోతున్నాడు. దీనికి మొదట చట్టానికి ‘కళ్ళు ‘లేవు.ఆ తరువాత’ జస్టిస్’ లాంటి పేర్లను అనుకున్నారు .ఫైనల్ గా’ వాస్కోడిగామా ‘అని ఫిక్స్ చేశారు.ఈ సినిమా స్టోరీ న్యాయవాద వ్యవస్థలోని లోపాలని వెలికితీసే కథతో వస్తున్న సినిమా కాబట్టి దీనికి వాస్కోడిగామా అనేపేరు సూటబుల్ అని మురగదాస్ ఒప్పిస్తున్నట్లు సమాచారం.
ఇంతవరకు మురగదాస్ డైరెక్ట్ చేసిన గజని,సెవెంత్ సెన్స్ ,లాంటి సినిమాలు తెలుగులో మెగా హిట్ అయ్యాయి .ఆయన సినిమాల్లో కథ విభిన్నంగా ఉంటుంది. మహేష్ బాబు మురగదాస్ ఈ అరుదైన కాంబినష లో వచ్చే ఈ మూవీ మహేష్ కి బ్రహ్మోత్సవం ప్లాప్ తరవాత మంచి హిట్ ఖాతాలో వేసుకుంటాడా అంతా మురగదాస్ చేతుల్లోనే ఉంది.. ఈ చిత్రంలో మహేష్ సరసన పరిణితి చోప్రా నటిస్తుంది.