మహేష్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!

0
510

Posted [relativedate]

Mahesh Murugadoss First Look Releaseమహేష్ మురుగదాస్ సినిమా గురించి ఎలాంటి లుక్ రివీల్ అవలేదని ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన ఒ స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తుపాకి పట్టుకుని మహేష్ ఇంటెన్స్ లుక్ తో అదరగొడుతున్నాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ లుక్ ఉంది. మహేష్ 23వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ఏజెంట్ శివ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అది ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా సరే ఫస్ట్ లుక్ టీజర్ తోనే సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న మహేష్ ఈ లుక్ తో వారికి సడెన్ గిఫ్ట్ అందించాడు. మురుగదాస్ సినిమాలన్ని ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్. అకిరా అంచనాలను అందుకోకపోవడంతో మురుగదాస్ ఈ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో వర్క్ చేస్తున్నారు.

Leave a Reply