చెన్నై లో కొట్టుకుంటున్న మహీ ..

0
424

 mahesh murugadoss movie fight shooting chennaiమహేశ్ బాబు – మురుగదాస్ మూవీ తదుపరి షెడ్యూలు షూటింగు చెన్నయ్ లో జరుగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగును ఇటీవల హైదరాబాదులోని పాతబస్తీలో నిర్వహించారు. నైట్ ఎఫెక్ట్ లో కూడా కొన్ని పోరాట దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం చిన్న బ్రేక్ ఇచ్చారు.

తదుపరి షూటింగును ఈ ఆదివారం నుంచే చెన్నయ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహేశ్, రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తారు. విజయదశమికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు చిత్రబృందం కృషిచేస్తోంది. ప్రముఖ కెమేరామెన్ సంతోష్ శివన్ దీనికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతను నిర్వహిస్తున్నారు. హారిస్ జయరాత్ స్వరాలు సమకూర్చుతున్నారు.

Leave a Reply