మహేష్-మురగ సినిమా శాటిలైట్ రేటెంతో తెలుసా ?

 Posted October 21, 2016mahesh murugadoss movie satellite rights

‘శ్రీమంతుడు’ మహేష్ నాన్ ‘బాహుబలి’ రికార్డులన్నీ చెరిపేశాడు. ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగాడు మహేష్. మహేష్-మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఏజెంట్ శివ, అభిమన్యుడు, ఎనిమీ. తదితర టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీఅంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది.

ఈ చిత్రం శాటిలైట్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జీ సంస్థ ఏకంగా 26 కోట్లకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారమ్. తెలుగు+హిందీ రైట్స్ కలిపి ఇంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు జీ-సంస్థ ముందుకొచ్చినట్టు చెబుతున్నారు. మహేష్ సినిమాలకు బుల్లితెరపై ఫుల్ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమా సాటిలైట్ హక్కులు పొందడానికి పలు టివి ఛానల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి బుల్లితెరపై మహేష్ ఎంతకు అమ్ముడుపోతాడో చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. విలన్ గా దర్శకుడు ఎస్. జె సూర్య కనిపించబోతున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE