బాప్రే అనిపిస్తున్న మహేష్ టీజర్ ఖర్చు

0
567
mahesh murugadoss movie teaser cost

Posted [relativedate]

mahesh murugadoss movie teaser costటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న  సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంభవామి, మహేష్ 23, ఏజెంట్ శివ, ఎనిమీ… ఇలా రకరకాల టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. కాగా   ఈ సినిమాకు సంబంధించిన  ఒక్క ఫస్ట్ లుక్ గానీ, పోస్టర్ గానీ విడుదల కాకపోయినా, కేవలం మహేష్, మురుగదాస్ కాంబో అన్న కారణంతోనే   అంచనాలు భారీగా  ఏర్పడ్డాయి. అందునా ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు తమ హీరో లుక్ ఎలా ఉంటుందోనని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మహేష్ తన అభిమానుల కోరికను తీర్చే ప్రయత్నాలు మొదలుపెట్టాడట.

 టాలీవుడ్, కోలీవుడ్ లలో ఏకకాలంలో విడుదలకానున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను అదిరిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. లండన్ లో ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల ఆధ్వర్యంలో భారీ ఖర్చుతో టీజర్ ను తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. ఈ ఒక్క టీజర్ కోసమే నిర్మాతలు  రూ. 35లక్షలు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఉగాది సందర్భంగా ఈ టీజర్ ను విడదల చేయనున్నారని తెలుస్తోంది. మరి ఇంత ఖర్చుపెట్టి రూపొందిస్తున్న ఈ టీజర్ టాలీవుడ్ వాళ్లతో పాటు కోలీవుడ్ వాళ్లని ఎలా ఆకర్షిస్తుందో చూడాలి.

Leave a Reply