మహేష్ తో మురుగ ఏమి చెప్పిస్తాడు?..

0
457
enemyపండగ నాటికి తమ అభిమానులకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకోవడం.. హీరోలకు ఈ మధ్య బాగా అలవాటైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫ్యాన్స్కి ఇలాంటి గిఘ్టలు బాగానే ఇస్తుంటాడు. ఓ వారం క్రితం ప్రిన్స్ బర్త్ డే నాడు.. మహేష్ కొత్త మూవీకి సంబంధించిన లుక్ రివీల్ చేస్తారనే ప్రచారం
జరిగినా.. అలాంటివేవీ బయటకు రాలేదు.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ మూవీకి.. టైటిల్ ఫైనల్ చేసేశారన్న వార్త టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది. అయితే.. ఇప్పటివరకూ దీన్ని లీక్ కానివ్వలేదు. దసరా పండుగ నాడు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
న్యాయ వ్యవస్థలోని లోపా లను బయటపెట్టి.. కళ్లకు కట్టినట్లుగా అన్యాయాలను చూపించే కథాంశంతో మహేష్ ను చూపించబోతున్నాడట మురుగదాస్.మహేష్-మురుగ కాంబినేషన్‌లో వచ్చే చిత్రానికి ఎనిమీ అనే టైటిల్ చాలా రోజులుగా వినిపిస్తోంది. మరి ఇదే టైటిల్‌ని ఫైనల్ చేశారో.. కొత్తగా మరేదన్నా పవర్ ఫుల్ టైటిల్‌ని డిసైడ్ చేశారో తెలియాల్సి ఉంది. అదేంటో తెలియాలంటే.. దసరా పండుగ వరకూ వెయిట్ చేయక తప్పని పరిస్థితి. మరి ఈసారి మహేష్ ఎనిమీ అంటూ సింగిల్‌గా సత్తా చాటేసే ఛాన్సులు చాలానే ఉన్నాయి.

Leave a Reply