మహేష్ టైటిల్ ‘సంభవామి’..!

0
379
Mahesh Murugadoss Title Sambhavami

Posted [relativedate]

Mahesh Murugadoss Title Sambhavamiసూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా టైటిల్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది. నిన్న మొన్నటిదాకా ఈ సినిమా టైటిల్ ఏజెంట్ శివ, అభిమన్యుడు అంటూ వార్తలు వచ్చాయి. ఏజెంట్ శివ దాదాపు కన్ఫాం అయినట్టే అని కొందరు అన్నారు. తీరా ఈ రెండు కాకుండా ఇప్పుడు మరో కొత్త టైటిల్ మహేష్ సినిమాకు వినిపిస్తుంది. అదే ‘సంభవామి’. ఇప్పటికే ఈ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారట సినిమా నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం అహ్మాదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ జనవరి 1న రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్ ఎంతగానే ఎదురుచూస్తున్న ఈ సినిమా అప్డేట్స్ పై రోజుకో రూమర్ రావడంతో విసుగు చెందిన ఫ్యాన్స్ అసలు టైటిల్ ఏదై ఉంటుందా అని కన్ ఫ్యూజన్ లో పడ్డారు. అయితే అది తెలియాలంటే మాత్రం జనవరి 1 దాకా వెయిట్ చేయాల్సిందే.

మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో తన లుక్ ఇంతకుముందు ఎన్నడు చూడని విధంగా ఉంటుందని తెలుస్తుంది. జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

Leave a Reply