మహేష్ లుక్.. దీపావళికి పక్కా !

Posted October 3, 2016

mahesh new lookమహేష్-మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు
70కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ
అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చైన్నై షెడ్యూల్స్ కూడా
పూర్తయ్యాయి. అయినా.. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్కు
లేదూ.. పిక్కూ లేదు. దీంతో.. ప్రిన్స్ ఫ్యాన్స్ ఈ చిత్రం ఫస్ట్ కోసం
ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీపావళికి మహేష్ సినిమా ఫస్ట్ లుక్.. ఈ
స్పెషల్ టీజర్ ని కట్ చేయడానికి మురగదాస్ ఒక రోజుని స్పెషల్ గా
కేటాయించనున్నారనే ప్రచారం జరిగింది. కానీ.. చిత్రబృందం నుండి ఎలాంటి
అధికారిక ప్రకటన రాలేదు.

అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం.. ఈ దీపావళికి మహేష్
ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందట. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో తెరకెక్కనుంది.
ఇప్పటికే టాలీవుడ్ లో మహేష్ సూపర్ స్టార్. ఇక, తమిళ్ లోనూ ప్రిన్స్ కి
ఫాలోయింగ్ ఉంది. దానిని ఇంకా రెట్టింపు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు
మురగ. ఇందుకోసం కోలీవుడ్ కి ప్రత్యేకమైన దీపావళి రోజున మహేష్ ఫస్ట్ లుక్
ని ప్లాన్ చేసినట్టు సమాచారమ్.

ఇదిలావుండగా.. ఈ చిత్రంలో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా
కనిపించబోతున్నాడని చెపుకొంటున్నారు. సినిమా టైటిల్స్ గా ఎనిమీ,
అభిమన్యుడు.. తదితర పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అంతేకాదు.. ఓ ఫైట్స్
సీక్వెన్స్ ని దాదాపు 3కోట్లతో అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట
మురగ. ఈ చిత్ర్రంలో మహేష సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. విలన్ గా
దర్శకుడు ఎస్. జె సూర్య కనిపించబోతున్నాడు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు
నిర్మాతలు.

SHARE