నమో వెంకటేశాయతో ఆ  నిర్మాత పరిస్థితి నమస్కారమేనా..?

0
459
mahesh reddy losses om namo venkatesaya movie

Posted [relativedate]

mahesh reddy losses om namo venkatesaya movieదర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, కింగ్ నాగార్జున కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. జానకి రాముడు, ఆఖరిపోరాటం, ఘరానా బుల్లోడు  వంటి కమర్షియల్ సినిమాలతో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస సినిమాలు  కూడా వీరి కాంబినేషన్ లో వచ్చినవే.. విజయాన్ని సాధించినవే. ఇప్పటివరకు చెప్పింది గతం. అయితే ప్రస్తుత రోజుల్లో భక్తిరస సినిమాలు తీయాలంటే మాత్రం కాస్తంత ధైర్యం, తెగువ ఉండాలి. యావరేజ్ విజయం సాధించిన పర్వాలేదు అన్న డేర్ ఉండే నిర్మాతలే ఇటువంటి సినిమాలను నిర్మించడానికి ముందుకొస్తుంటారు. అయితే ఈ భక్తిరస సినిమాలు యావరేజ్ కాకపోగా డిజాస్టర్ గా నిలవడంతో ముందుకొస్తున్న అరాకొరా నిర్మాతలు కూడా హడలిపోతున్నారు.

తాజాగా నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ… ఆ చిత్ర నిర్మాత మహేష్ రెడ్డికి  ఇటువంటి చేదు అనుభవాన్నే మిగిల్చింది. నాగార్జున.. రాఘవేంద్రరావు కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్ తో గతంలో ఈ నిర్మాత శిరిడీసాయి చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా యావరేజ్ అయ్యింది. దీంతో  ఈ  సారి ఎలాగైనా అన్నమయ్య రేంజ్  హిట్ కొట్టాలన్న తపనతో మహేష్ రెడ్డి ఓం నమో వెంకటేశాయని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం పొందింది. ఏ అంచనాలు  లేకుండా విడుదలై భారీ విజయాన్ని పొందుతున్నాయి చిన్న చిత్రాలు. అటువంటిది ఎన్నో అంచానాల మధ్య భారీ బడ్జెట్ మూవీగా వచ్చిన ఈ భక్తిరస చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా ఇచ్చిన అనుభవంతో మరి భవిష్యత్తులో ఇటువంటి నిర్మాతలు టాలీవుడ్ లో కనిపిస్తారా లేక కనుమరుగౌతారో చూడాలి.

Leave a Reply