సీక్రెట్ : ఇద్దరితో మహేష్ రొమాన్స్

 Posted October 18, 2016

mahesh romance two heroines koratala siva movie

సూపర్ స్టార్ మహేష్ బాబు రొమాన్స్ చేసే ఇద్దరి  హీరోయిన్స్ వివరాలని దర్శకుడు కొరటాల సీక్రెట్ గా ఉంచారట.ప్రస్తుతం మహేష్ మురగదాస్ చిత్రంతో బిజీ  ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.దాదాపు రూ. 6కోట్లతో ఓ భారీ కారు ఛేజ్ సీన్ నితెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ సినిమాలో హైలైట్ గా నిలవనుందట. ఈ చిత్రం కోసం అభిమన్యుడు, ఎనిమీ, శత్రువు, ఏజెంట్ శివ. టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ‘ఏజెంట్ శివ’ టైటిల్ దాదాపు ఫిక్సయినట్టు చెబుతున్నారు.

మురగదాస్ చిత్రం తర్వాత మహేష్ మరోసారి దర్శకుడు కొరటాల శివతో జతకట్టబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడు కొరటాల. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేష్ ఏకంగా ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారంట. ఈ న్యూస్ ప్రిన్స్ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. అంతేకాదు.. ఇందులో ఇద్దరు మహేష్ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడట. ప్రస్తుతం దర్శకుడు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలో వేటలో ఉన్నారట. ఆ వివరాలని సీక్రెట్ గా ఉంచుతున్నాడు దర్శకుడు కొరటాల. పొలిటికల్ డ్రామా.. సీఎంగా మహేష్.. ఇద్దరితో రొమాన్స్.. చూస్తుంటే ‘శ్రీమంతుడు’ రికార్డులన్నీ తుడిచిపెట్టేలా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు దర్శకుడు కొరటాల.

SHARE