స్మార్ట్ విలన్ కు షాక్ ఇచ్చిన మహేష్..!

0
362
Mahesh Shock To Smart Villain Aravind Swamy

Posted [relativedate]

Mahesh Shock To Smart Villain Aravind Swamy

రోజా, బొంబాయి సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించిన తమిళ హీరో అరవింద్ స్వామి ఇప్పుడు విలన్ గా కొత్త అవతారమెత్తాడు. కోలీవుడ్ లో ఇప్పటికే తని ఒరువన్ హిట్ అవడం అదే సినిమా తెలుగులో కూడా తీసి హిట్ సాధించడం జరిగింది. అయితే తెలుగులో కూడా ఊహించని రేంజ్లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అరవింద్ స్వామి ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక నిన్న మొన్నటిదాకా కోటి కి అటు ఇటుగా ఉన్న ఈయన ఇప్పుడు టచ్ చేస్తే 3 కోట్ల పైమాటే అంటున్నాడట

రీసెంట్ గా కొరటాల శివ మహేష్ సినిమా ముహుర్తం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో ఓ ప్రత్యేక పాత్రకు అరవింద్ స్వామిని అడిగారట. అయితే 3 కోట్లు ఇస్తేనే చేస్తా అనేయడంతో మహేష్ అంత అయితే అతను అవసరం లేదని చెప్పేశాడట. మహేష్ ఇచ్చిన రెస్పాన్స్ కు అరవింద్ స్వామి షాక్ అయ్యాడని కోలీవుడ్ టాక్. ఇప్పటికే జయం రవితో బోగన్ సినిమాలో నటిస్తున్న అరవింద్ స్వామి ఇప్పుడు మరోసారి హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.

ఇన్నాళ్లు లైం లైట్ లో లేని ఈ హీరో సడెన్ గా విలన్ గా టర్న్ తీసుకుని హిట్ కొట్టేసరికి ఒక్కసారి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మరి రెమ్యునరేష్ డిమాండ్ కాస్త తగ్గించి వరుస సినిమాలు చేస్తే తెలుగు తమిళ భాషల్లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వదులుకుంటాడో లేక కన్విన్స్ అయి చేస్తాడో అతనికే తెలియాలి.

Leave a Reply