బాలయ్యకు స్పాట్‌ పెట్టిన మహేష్‌!!

146
Spread the love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mahesh spot into Balayya's movie
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. షూటింగ్‌ ప్రారంభం అయ్యి సంవత్సరం అయినా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. జూన్‌లో విడుదల అవుతుందని ఆశించిన ఈ సినిమా ఆగస్టుకు, అక్కడ నుండి ఇప్పుడు సెప్టెంబర్‌కు వాయిదా పడటం జరిగింది. షూటింగ్‌ అనుకున్న సమయం కంటే ఆలస్యం అవుతుందని, మూడు భాషల్లో కొన్ని సీన్స్‌ను ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నందున ఈ ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుందని ప్రకటించిన నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్‌ కాస్త ఆందోళనలో ఉన్నారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తర్వాత ప్రస్తుతం బాలకృష్ణ తన 101వ సినిమాను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రారంభం సమయంలోనే సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసి తీరుతాం అంటూ పూరి ప్రకటించాడు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అనుకున్న సమయం కంటే కాస్త ముందే షూటింగ్‌ పూర్తి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్‌లో బాలయ్య సినిమా ఉంటుంది. ఇక వారం అటు లేదా ఇటుగా మహేష్‌బాబు సినిమా కూడా విడుదల అవ్వనుంది. 110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మహేష్‌బాబు సినిమాతో బాలయ్య ఢీ కొట్టడం చాలా కష్టం. అందుకే మహేష్‌ స్పైడర్‌ వల్ల బాలయ్య సినిమాకు ఇబ్బందులు తప్పవని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్‌ కొందరు మాత్రం ‘స్పైడర్‌’ మరోసారి వాయిదా పడ్డా పడుతుందని, బాలయ్య సినిమాకు టెన్షన్‌ ఏమీ లేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here