మహేష్‌ ‘స్పైడర్‌’ లుక్‌ అదిరింది

0
347

Posted [relativedate]

mahesh Spyder First Lookసూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ కోసం గత నాలుగు నెలలుగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్నాళ్లకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ రివీల్‌ అయ్యింది. తన ప్రతి సినిమాలో విభిన్న కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే మురుగదాస్‌ ఈ చిత్రంలో కూడా ఒక సామాజిక అంశంను చూపించబోతున్నాడు. 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాదికి ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. టైటిల్‌పై కూడా నేటి వరకు ఒక స్పష్టత ఇవ్వకుండా చిత్ర యూనిట్‌ సస్పెన్స్‌ పెడుతూ వచ్చారు.

ఎట్టకేలకు నేడు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు గత చిత్రాలతో పోల్చితే మరింత వయస్సు తగ్గిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. బక్కగా, స్టైలిష్‌లుక్‌తో మహేష్‌బాబు ఆకట్టుకుంటున్నాడు. చేతిలో గన్‌ పట్టుకుని స్టైలిష్‌ లుక్‌తో ఫ్యాన్స్‌కు మహేష్‌బాబు పిచ్చెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లో నెం.1 చిత్రంగా నిలవడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను కూడా అతి త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయనున్నారు. మహేష్‌బాబుకు జోడీగా ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిం

Leave a Reply