హైదరాబాద్‌ నిమ్స్‌ నుండి చెన్నై అపోలోకు మహేష్‌బాబు!

0
520
mahesh spyder movie climax scene shift from hyderabad nims to chennai apollo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

mahesh spyder movie climax scene shift from hyderabad nims to chennai apolloసూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘స్పైడర్‌’ చిత్రానికి వరుసగా ఏవో ఒక అడ్డంకులు, అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి కావాల్సి ఉండగా ఇంకా పూర్తి కాలేదు. దాంతో వచ్చే నెలలో విడుదల కావాల్సిన సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ జరపాల్సి ఉంది. తాజాగా నిమ్స్‌లో ఈ సినిమా బ్యాలన్స్‌ షూట్‌ను చేయాలని ప్లాన్‌ చేశారు. ఒక్క రోజు షూటింగ్‌ చేయగానే అక్కడ కొంత మంది అడ్డు చెప్పారు. పేషెంట్స్‌కు ఇబ్బందిగా ఉన్న కారణంగా అక్కడ నుండి ‘స్పైడర్‌’ సర్దుకోవాల్సి వచ్చింది.

హైదరాబాద్‌ నిమ్స్‌లో చేయాలని ప్లాన్‌ చేసిన క్లైమాక్స్‌ సీన్స్‌ను ఇప్పుడు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే అక్కడ అన్ని అనుమతులు పొందారు. వారం రోజుల పాటు హాస్పిటల్‌ పరిసర ప్రాంతం మరియు లోపల కొన్ని సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారు. ఈనెలాకరుతో సినిమాను ప్యాచ్‌ వర్క్‌తో సహ పూర్తి చేయాలని మురుగదాస్‌ భావిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్‌బాబు చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. దాంతో ఫ్యాన్స్‌ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

Leave a Reply