‘శ్రీమంతుడు’ ఖాతాలో మరో రికార్డ్….!

 Posted October 18, 2016

mahesh srimanthudu create new record

‘శ్రీమంతుడు’ మహేష్ బాబు ఎవరిన్ని వదల్లేదు. ఒక్క ‘బాహుబలి’ని తప్ప. బాహుబలిని మినహాయిస్తే.. మిగిలిన రికార్డులన్నీ కొల్లగొట్టాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ లో టాప్-2 చిత్రం నిలిచింది శ్రీమంతుడు. మహేష్ బాబు – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ వసూళ్లలోనూ శ్రీమంతుడుగా నిలిచాడు. వందకోట్లకుపైగా వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేశాడు.

తాజగా, ‘శ్రీమంతుడు’ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన శ్రీమంతుడు ఆడియో సాంగ్స్ ను అదే కంపెనీ అఫీషియల్యూట్యూబ్ ఛానల్ లోనూ రిలీజ్ చేసింది.యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటి వరకు 80 లక్షల మందిపైగా వినటంతో అరుదైన రికార్డ్ శ్రీమంతుడు సొంతమయ్యింది. ‘శ్రీమంతుడు’కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ క్రిడెట్ అంతా దేవీకి చెందుతుందంటున్నాడు కొరటాల. అన్నట్టు.. మహేష్-కొరటాల కలయికలో మరో చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వచ్చే యేదాది  జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

SHARE