మహేష్‌ ఇదేం బాగోలేదు..!

0
481
mahesh this is not correct way

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

mahesh this is not correct way
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్‌’ చిత్రం కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంవత్సర కాలంగా మహేష్‌బాబు సినిమా లేదు. ఆ లోటును ‘స్పైడర్‌’ తీర్చుతుందని, ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్‌ను స్పైడర్‌ కవర్‌ చేస్తుందని అంతా భావిస్తున్న సమయంలో ఫ్యాన్స్‌కు షాక్‌ మీద షాక్‌ తలుగుతుంది. ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలవుతుందని భావించిన మహేష్‌ కొత్త సినిమా స్పైడర్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా జూన్‌లో సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు. అయితే షూటింగ్‌ అనుకున్న స్థాయిలో జరడం లేదని, పైగా సినిమా బడ్జెట్‌ 100 కోట్లకు ఎక్కువ కనుకగా కాస్త ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. జూన్‌ నుండి ఆగస్టుకు రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టులో కూడా ‘స్పైడర్‌’ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు 11 నుండి సెప్టెంబర్‌ 15 లేదా 22కు వాయిదా పడ్డట్లుగా చెబుతున్నారు. మొత్తానికి మహేష్‌బాబు సినిమాతో ఫ్యాన్స్‌కు చిరాకెత్తుతుంది. ఇలా వాయిదాలు వేయడం ఏమీ బాగాలేదు అంటూ తమ అభిమాన హీరోను సున్నితంగా ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు. మరో వైపు వచ్చే నెల నుండి కొరటాల శివ సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply