మహేష్,వంశీ, పీవీపీ.. ఫిక్స్

0
456

 mahesh vamshi movie fix

వంశీ పైడిపల్లి డైరక్షన్లో మహేష్ బాబు ఓ చిత్రాన్ని చేయనున్నాడంటూ ఇటీవల వార్తలొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ నిర్మించనుంది. ఈ విషయాన్ని పీవీపీ అధినేత ప్రసాద్ వి.పొట్లూరి అధికారికంగా ధ్రువీకరించారు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ న్యూస్ ను మీడియాకు వెల్లడించారు.

మహేష్-వంశీ కాంబినేషన్లో ఈ చిత్రం కొత్త తరహాలో వుంటుందని ప్రసాద్ చెప్పారు. షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో చేస్తామని అన్నారు. భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తారని… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న మహేష్, కొరటాల శివతో కూడా ఓ సినిమా చేస్తారు.

Leave a Reply