మహేష్‌కు ఇప్పుడు దానిపై మోజు ఏంటో?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

mahesh want to act in love story movie with jayanth c paranjee direction
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరో అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో అద్బుత చిత్రాల్లో నటించిన మహేష్‌బాబు ప్రస్తుతం సామాజిక అంశాల నేపథ్యంలో కొన్ని సినిమాలు చేస్తూనే, కొన్ని కమర్షియల్‌ మూవీస్‌ను కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్‌బాబు స్పైడర్‌ చిత్రాన్ని మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక పొటిటికల్‌ డ్రామా సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. ఇలా విభిన్న కథాంశాలతో మహేష్‌బాబు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి మహేష్‌బాబుకు ప్రేమ కథలో నటించాలనే కోరిక కలిగిందట.

మహేష్‌బాబు వయస్సు ప్రస్తుతం 40 దాటింది. ఈ వయస్సులో బాబుకు ప్రేమ కథలపై మోజు ఏంటని భావిస్తున్నారా, అవును స్వయంగా మహేష్‌బాబు తన కోసం ఒక మంచి ప్రేమ కథను సిద్దం చేయాల్సిందిగా స్వయంగా జయంత్‌ సి పరాన్జీని కోరడం జరిగిందట. వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా సంవత్సరాల క్రితం ‘టక్కరి దొంగ’ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా అప్పటి నుండి వీరిద్దరి మద్య స్నేహం కొనసాగుతూ వస్తుంది. ఆ స్నేహంతోనే జయంతో మరో సినిమా చేయాలని మహేష్‌ కోరుకుంటున్నాడు. అయితే అది ఒక మంచి ప్రేమ కథ కావాలంటూ మహేష్‌ మెలిక పెట్టాడు. ప్రస్తుతం గల్లా రవితేజతో ‘జయదేవ్‌’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్న జయంత్‌ ఆ తర్వాత మహేష్‌ కోసం లవ్‌స్టోరీని తయారు చేస్తాడట. ఈ విషయాన్ని తాజాగా జయంత్‌ మీడియాతో చెప్పుకొచ్చాడు. లవ్‌ స్టోరీతో మహేష్‌ బాబు గతంలో సినిమాలు చేశాడు. కాని ఇప్పుడు మెప్పించగలడా అనేది అనుమానమే.

Leave a Reply