ఇదీ అమర జవాన్లకు అసలైన సాయం..

 maheshbhai savani helped uri death army peoples family
ఒలింపిక్స్ పతక విజేతలకు ప్రోత్సాహం అందించడానికి పోటీలుపడ్డ సంస్థలు,వ్యక్తులు,ప్రభుత్వాలు అమర జవాన్ల విషయానికి వచ్చేసరికి ఎక్కడలేని పిసినారితనం చూపిస్తున్నాయి.పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల సాయాన్ని ప్రకటించింది. దీనిపై ఆ జవాన్ భార్య ఘాటుగా స్పందించింది.నా భర్త డ్రైనేజీ లో పడి చనిపోలేదు…దేశం కోసం ప్రాణాలు అర్పించాడంటూ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించింది. దీంతో దిగొచ్చిన నితీష్ సర్కార్ 11 లక్షల సాయం అందిస్తామని చెప్పారు.నితీష్ ఇంకా నయం ..ఓ విమర్శ వచ్చిన వెంటనే మనసు మార్చుకున్నారు. బడా బడా వ్యాపారసంస్థలు తమ గొప్పదనాన్ని చాటుకోడానికి క్రీడాకారులకు కోట్లు కుమ్మరించేవి.కానీ యురి ఘటనలో అసువులు బాసిన వారి విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి.

 maheshbhai savani helped uri death army peoples familyఈ పరిస్థితుల్లో గుజరాత్ లోని సూరత్ కి చెందిన ఓ వ్యాపారవేత్త పెద్ద మనసుతో వ్యవహరించారు.మహేష్ భాయ్ సవాని అనే అయన తన దాతృత్వానికి ఓ అర్ధం పరమార్ధం వుండే నిర్ణయం తీసుకున్నాడు.యూరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అన్ని కుటుంబాల్లోని పిల్లలకి పూర్తిస్థాయిలో విద్యఖర్చులు భరించడానికి ముందుకొచ్చారు.ఈ ప్రపంచంలో వారు ఎక్కడ ఏది చదివినా ఆ ఖర్చంతా తానే పెట్టుకుంటానని మహేష్ చెప్పాడు.అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా మొదలెట్టాడు.దేశం కోసం అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకి తాను చేసేది చిన్న సాయమే అని చెబుతున్న మహేష్ కూడా రియల్ హీరో ..

SHARE