మజ్ను రివ్యూ …

Posted September 23, 2016

 nani majnu movie review

చిత్రం : మజ్ను (2016)
నటీనటులు : నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : విరించి వర్మ
నిర్మాత : గీత గొల్ల, పి. కిరణ్

నేచుర‌ల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ‘భలే భలే మగాడివోయ్’ భంపర్ హిట్ తో నాని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ రేంజ్ కి
తగ్గట్టుగానే కథలని ఎంపిక చేసుకొని వరుసగా హిట్స్ కొడుతున్నాడు నాని.ఇప్పటికే వరుసగా నాలుగు హిట్స్ ని తన ఖాతాలో వేసుకొన్నాడు. భలే భలే
మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మెన్.. వీటిలో దేనికదే ప్రత్యేకమైనది. తాజాగా, ‘మజ్ను’తో మన ముందుకు వచ్చేశాడు. ‘ఉయ్యాల జంపాల’
ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన అను ఇమ్మాన్యుయల్, ప్రియా శ్రీ లు హీరోయిన్లుగా నటించారు.

ఇప్పటికే రిలీజైన ‘మజ్ను’ టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలనిపెంచేలా చేశాయి. అసిస్టెంట్ డైరక్టర్ గా కెరిర్ ప్రారంభించిన నాని.. ఈ సినిమాలోనూ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించనుండటం. అది కూడా రాజమౌఌ దగ్గర కావడం.. యంగ్ హీరో రాజ్ తరుణ్ గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడం సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇన్ని అంచనాల మధ్య ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మజ్ను’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది. నాని ఖాతాలో
మరో హిట్ పడినట్టేనా తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
ఆదిత్య (నాని) ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వద్ద “బాహుబలి” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. సుమ (ప్రియా శ్రీ) అనే అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేయసి మెప్పు పొందడానికి నిజాయితీగా ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తను చదువుకొనే రోజుల నాటి అందమైన, పాత ప్రేమకథని చెబుతాడు. ఆదిత్య నిజాయితీని చూసి సుమ కూడా ప్రేమలో పడిపోద్ది.

ఇదిలా సాగుతుండగానే.. పాత ప్రేయసిని ఇంకా మరచిపోలేదని ఆదిత్య రియలైజ్ అయి.. కాస్త సందిగ్థంలో పడిపోతాడు. ఇంతలో పాత ప్రేయసి ప్రేయసి కిరణ్ (అను ఇమ్మానుయేల్) కథలోకి ఎంట్రీ ఇస్తుంది. దీంతో..  వీరి ప్రేమ కథ కొత్త  ఏ మలుపు తిరిగాయి. చివరికి ఆదిత్య ఎవరి ప్రేమని దక్కించుకొన్నాడు అనేది
మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* స్రీన్ ప్లే
* నాని
* సినిమాటోగ్రఫ్రీ

మైనస్ పాయింట్స్ :
* కాస్త సాగదీత
* ప్రీ క్లైమాక్స్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
దర్శకుడు విరించి వర్మ చెప్పిన కథ కొత్తదేమీ కాదు. కాకపోతే.. కథని అందంగా, సహజంగా చెప్పాడు. ఫస్టాఫ్ లో ప్రేమకథతో కట్టిపడేశాడు. సెకాండాఫ్లో కథ కంటే కామెడీకి ప్రాధ్యాన్యత ఇచ్చాడు దర్శకుడు. అయితే, ఫస్టాఫ్ లో వచ్చే భీమవరంలో సాగే హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీని దర్శకుడు డీల్ చేసిన విధానం సూపర్భ్. ఈ ఏపీసోడ్ కోసమైన యూత్ ‘మజ్ను’ని చూడాలను కొట్టారు. అంత అందంగా, సహజంగా ఆ లవ్ ట్రాక్ ని తీర్చిదిద్దాడు వర్మ. ఇక, సెకాండాఫ్ లో కథ కంటే కామెడీకే ప్రాధాన్యత ఇచ్చినా.. ఎక్కడా బోర్ కొట్టించలేదు. మొత్తానికి.. దర్శకుడు వర్మ పాసైపోయాడు.

నాని ఎప్పటిలాగే తన సహజ నటనతో అదరగొట్టాడు. తన నటనతో సినిమా స్థాయిని ఇంకాస్త పై స్థాయికి తీసుకెళ్లాడు. ముఖ్యంగా భీమవరంలో సాగే హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో జీవించేశాడు. ఈ సినిమాలని మొదటి ప్రేమ కథ యూత్ ని ఆకట్టుకోవడం ఖాయం. నాని కామెడీ కూడా చేశాడు. హీరోయిన్స్  అను
ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ ఫర్వాలేదనిపించారు. ప్రియా శ్రీ కంటే అను కే నటించే స్కోప్ దక్కింది. సెకండ్ హాఫ్ లో వెనెల కిషోర్ కాసిన్ని నవ్వులు పంచాడు.

సాంకేతికంగా :
ఓ అమ్మాయిని ఫస్ట్ చూపులోనే ప్రేమించి.. ఆ అమ్మాయికి దగ్గరయ్యే క్రమంలో పాత ప్రేయసి గుర్తురావడం. పాత ప్రేమ కథని కొత్త ప్రేయసి చెప్పి.. కొత్త ప్రేమ కథని మొదలెడుతున్నాని హీరో భావించడం కొంచెం లాజిక్కు దూరంగా ఉండే అంశాలు. ఇవి ప్రక్కన పెడితే మజ్ను మంచి ప్రేమకథ. సినిమాటోగ్రఫ్రీ చాలా బాగుంది. భీమవరం బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీని ప్రతి ఫ్రేమ్ లోనూ చాలా అందంగా చూపించారు. గోపి సుందర్ అందించిన పాటలు, నేపథ్యం సంగీతం బాగుంది. కొన్ని డైలాగ్స్ బాగా పేలాయ్. ఎడిటింగ్ కూడా బాగుంది. కాకపోతే.. సెకాండాఫ్ లో కొంచెం కత్తెర పెడితే ఇంకా బాగుండేది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
‘మజ్ను’ మంచి ప్రేమకథా చిత్రం. యూత్ ఫుల్ మూవీ. రొమాటింక్ చిత్రాలని.. నాని నటనని ఇష్టపడేవారు ‘మజ్ను’ని తప్పక చూడాల్సిందే. కాసేపు సరదాగా
నవ్వుకోవాలనుకునే వారు కూడా మజ్ను కోసం వెళ్లవచ్చు.

రేటింగ్ : 3.25/5
బాటమ్ లైన్ : ‘మజ్ను’.. పాత, కొత్త ప్రేమకథల సమ్మేళనం.. ఫుల్ మజాగుంది !

SHARE