పరీక్ష తప్పిన పిల్లాడి కుంటిసాకులు సాక్షి కి సాక్ష్యమా?

0
537
maki founder chairman mahiko maki says about bihar and ap ruling

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

maki founder chairman mahiko maki says about bihar and ap ruling
జపాన్ కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ “మాకి” ఫౌండర్ ఛైర్మన్ మహికో మాకి ఓ ఇంజనీరింగ్ పత్రిక కోసం రాసిన వ్యాసం ఇప్పుడు సాక్షి కి పెద్ద సాక్ష్యమై కూర్చుంది. చంద్రబాబు పాలన అధ్వాన్నంగా ఉందని చెప్పడానికి ఈ ఆర్టికల్ ని వాడుకుంటోంది.ఈ వ్యాసంలో ఏపీ, బీహార్ ప్రభుత్వాల వ్యవహారశైలిని పోల్చుతూ మాకి కొన్ని వ్యాఖ్యలు చేశారు.ఏపీ కన్నా బీహార్ లో పాలన బాగుందన్నది ఆ వ్యాఖ్యల సారాంశం.అసలు మాకి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

అమరావతి రాజధాని డిజైన్స్ కోసం అంతర్జాతీయ సంస్థలకు పిలుపు ఇచ్చింది ఏపీ సర్కార్. ఆ రేసులో పోటీ పడింది మాకి కంపెనీ.ఆ సంస్థ డిజైన్స్ బాగున్నాయని అందుకోసం నియమించిన కమిటీ అభిప్రాయపడింది.అయితే అందులో భారతీయ సంస్కృతి ఎక్కడా కనిపించడం లేదని, పొగ గొట్టాల్లాంటి డిజైన్స్ ఇచ్చారని ఈ సాక్షి పత్రికే అప్పుడు గగ్గోలు పెట్టింది.డిజైన్స్ లో భారతీయత కనిపించాలన్న ఆలోచనకి అనుగుణంగా మాకి సంస్థని పక్కనపెట్టింది ఏపీ సర్కార్.దాంతో ఆ సంస్థకి కోపం రాకుండా ఉంటుందా ? పరీక్ష తప్పిన పిల్లాడి తాను సరిగ్గా చదవలేదని ఒప్పుకుంటాడా ? లేక కుంటిసాకులతో తప్పించుకుంటాడా ? అలాగే అవసరాలు,మార్పులకి అనుగుణంగా డిజైన్స్ అందించలేకపోయిన మాకి చేసిన కామెంట్స్ పట్టుకుని సాక్షి రచ్చ చేస్తోంది.అదే డిజైన్స్ కాంట్రాక్టు దక్కి ఉంటే మాకి లాగే మాట్లాడుతుందా?

Leave a Reply