ఆర్కే గాయపడ్డాడు…ఆ మావో చెప్పాడు

 

 Posted October 28, 2016

malkangiri maoists venu call to tv channel said about maoist leader rama krishana
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే ఎలా వున్నాడు?ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలకి ఇటు పోలీసులు ..అటు మావోల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి తప్ప స్పష్టమైన సమాధానం రావడం లేదు.ఈ పరిస్థితుల్లో ఓ ప్రముఖ ఛానల్ తో ఫోన్ లో మాట్లాడిన మల్కన్ గిరి ప్రాంత కమిటీ కార్యదర్శి వేణు ఎన్ కౌంటర్ గురించి వివరించారు.తాను అక్కడే ఉన్నట్టు…పోలీసులు హఠాత్తుగా కాల్పులతో విరుచుకుపడ్డారని చెప్పాడు.ఆ కాల్పుల నుంచి తప్పించుకునే సమయంలో ఆర్కే గాయపడటం చూశానని వేణు ఆ ఛానల్ కి తెలిపాడు.ఎన్ కౌంటర్ లో గాయపడ్డ ఏడుగురిని చిత్రహింసలు పెట్టి చంపినట్టు వేణు ఆరోపించాడు.

SHARE