లోకేష్ తో వంగవీటి శిష్యుడి భేటీ..

0
755

 malladi vishnu meets nara lokesh
ఏపీ లో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కి తెలుగు దేశం తెర లేపుతోంది.అయితే ఈసారి వైసీపీ తో పాటు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టుకుంటున్న కాంగ్రెస్ మీద కూడా దృష్టి పెట్టింది.ఈ వ్యవహారాన్నంతా యువనేత లోకేష్ చూసుకుంటున్నారు.కేవీపీ ప్రైవేట్ బిల్లు తరువాత కాంగ్రెస్ గొంతు పెరగడం చూసిన టీడీపీ తాజా వ్యూహానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ముందుగా రాజధాని ప్రాంతంలో బలంగా కాంగ్రెస్ వాయిస్ వినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే ,వంగవీటి రంగా శిష్యుడు మల్లాది విష్ణుపై కన్నేసింది.

ఇప్పటికే బార్ లో మద్యం కల్తీ కేసులో చిక్కుకున్న విష్ణు పై అనుచరులు కూడా ఒత్తిడి తెస్తున్నారట. అదే టైం లో దేశం శ్రేణుల నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అయన సీరియస్ గా తీసుకున్నారు.ఓ మాజీ ఐఏఎస్ ,రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు నిర్వహించి ..ప్రస్తుతం ఓ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.విష్ణుది ,ఆయనది ఒకే సామాజిక వర్గం కావడం కూడా కలిసొచ్చిందంట.

ముందస్తు చర్చలు ఫోన్ లో అయ్యాక లోకేష్ తో నేరుగా విష్ణు గన్నవరంలో సమావేశం అయినట్టు విశ్వసనీయ సమాచారం.ఈ భేటీలో విష్ణు ముఖ్య అనుచరులు,సహచరులు కొలనుకొండ శివాజీ ,నరహరశెట్టి నరసింహారావు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.వీరిలో శివాజీ ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధి కాగా ..నరసింహారావు పీసీసీ కార్యదర్శిగా వున్నారు .రాజకీయ భవిష్యత్ పై లోకేష్ వీరికి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం.వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ముఖ్యులు త్వరలో దేశం తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉన్నట్టు వినికిడి .

Leave a Reply