మల్లన్నసాగర్ హై టెన్షన్..

0
505

mallanna sagar high tension
మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై విరుసుకుపడ్డారు. రెండు సార్లు లాఠీచార్టీ చేశారు. నిర్వాసితులు రాళ్లు రువ్వడంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. తోగుట మండలం వేములఘాట్, పల్లె పహాడ్ భూ నిర్వాసితులు భారీ ర్యాలీగా జాతీయ రహదారి ముట్టడికి యత్నించారు. వేములఘాట్ శివార్లలో భూ నిర్వాసితులపై పోలీసుల విచక్షారహితంగా లాఠీచార్జి చేశారు. మహిళలు, పిల్లలపై పోలీసులు ప్రతాపం చూపారు. పోలీసుల లాఠీ దెబ్బలకు పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.

ఓ నిర్వాసిత యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్వాసితులకు మద్దతుగా పలు ప్రజాసంఘాలు అక్కడికి చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు.మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణను నిరసిస్తూ మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టేందుకు వెళ్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Leave a Reply