బాబు,కెసిఆర్ బాటలో మమతా..

Posted October 4, 2016

 Mamatha Follow Babu And KCR in Operation Aakarsh

ఆపరేషన్ ఆకర్ష్ లో దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి అ ఆ లు చదివితే ఆంధ్ర,తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు,కెసిఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేశారు.ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారపక్షాల ఆకర్ష్ దెబ్బకి విలవిలలాడుతున్నాయి.ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.దీంతో అక్కడ విపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్,సిపిఎం నానా హైరానా పడిపోతున్నాయి.

గడిచిన 4 నెలల వ్యవధిలో మొత్తం 6 గురు విపక్ష ఎమ్మెల్యేలు మమత పంచన చేరారు.వీరిలో ఐదుగురు కాంగ్రెస్ కి చెందినవారైతే,మరో ఎమ్మెల్యే సిపిఎం పార్టీ నుంచి గెలిచారు.దీంతో 294 మంది సభ్యులున్న బెంగాల్ అసెంబ్లీ లో విపక్ష ఎమ్మెల్యేల సంఖ్య 70 కి పడిపోయింది.ఈ పరిణామాలపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా మమత నోరు విప్పడం లేదు.ఆకర్ష్ ఆపడం లేదు.

SHARE