కాలుష్యం పై ఢిల్లీ యువత వీడియో నెట్ లో హల్ చల్..

Posted November 12, 2016

man smoked cigarette on baby faceరాజధాని ఢిల్లీని గత కొంతకాలంగా కాలుష్యం చుట్టేస్తోంది . ఈ కాలుష్యం ఫలితంగా గత కొన్ని రోజులుగా విషంమంచుతో ఢిల్లీ జనం అల్లాడుతున్నారు.దీని స్థాయి ఎలా ఉందంటే చిన్న పిల్లలు సైతం ఒక రోజులో 40 సిగరెట్లు తాగినంత వుంది .

ఢిల్లీ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ఏ మార్గం వెతకాలి అనే విషయంపై ప్రజలకు, ప్రభుత్వానికి అంతుపట్డడం లేదు. ఇతరులపై ఆధారపడకుండా తమ సమస్యను తామే పరిష్కరించడానికి నడుం కట్టాలని ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కొందరు యువత నడుం బిగించింది .

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల చల్ చేస్తోంది ఢిల్లీలో ఒక బస్ స్టాప్ వద్ద ఓ యువతి తన ఒడిలో శిశువును పెట్టుకొని కూర్చుంటుంది. పక్కనే ఉన్నఓ యువకుడు సిగరెట్ తాగుతూ పక్కన వున్న యువతి ఒడిలో ఉన్నశిశువు ముఖం మీదకు పొగను రింగురింగులుగా వదులుతుంటాడు. ఇదంతా చుసిన బస్టాప్ లో ఉన్న తోటి యువకులు ఈ సంఘటన చూసి అసహనానికి గురై సిగరెట్ పొగ వదులుతున్న యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు .

శిశువు ముఖం మీద సిగరెట్ పొగ వదిలితే తనను ఎందుకు అడ్డుకుంటున్నారని, మనమంతా ఢిల్లీలో ప్రతిరోజూ విష వాయువులు పీలుస్తున్నామని ఆ యువకుడు సమాధానం చెప్పి అందరినీ ఆలోచింపజేస్తాడు తాము శిశువు బొమ్మతో ఇలా నటించామని చెప్పి ఢిల్లీ కాలుష్యంపై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఢిల్లీ కాలుష్యంపై అందరినీ ఆలోచింపజేస్తున్న ఈ వీడియో యూ ట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోను ఓ సారి చూస్తే ఈ యువబృందాన్ని మీరూ అభినందిస్తారు….మీరు చుడండి ఒకసారి .

[wpdevart_youtube]V44BRqaJtP4[/wpdevart_youtube]

SHARE