మన ఊరి రామాయణం మూవీ రివ్యూ…

Posted October 7, 2016

  mana oori ramayanam movie review

చిత్రం : మన ఊరి రామాయణం (2016)
నటీనటులు : ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్య దేవ్, పృథ్వీ
సంగీతం : ఇళయరాజా
దర్శకత్వం : ప్రకాష్ రాజ్
నిర్మాత : ప్రకాష్ రాజ్
రిలీజ్ డేట్ :  07అక్టోబర్, 2016.

నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మారి చేసిన మరో చిత్రం “మన ఊరి రామాయణం”. వైవిధ్యమైన సినిమాలు వస్తే జనం ఆదరిస్తారు అన్నది వాస్తవమే. ఇప్పుడు అది నమ్మే ప్రకాష్ రాజ్ ‘మన ఊరి రామాయణం’ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కథనాన్ని ఎమోషనల్ గా నడపడంలో ప్రకాష్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ప్రకాష్ రాజ్‌తో పాటుగా ప్రియమణి, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘మన ఊరి రామాయణం’ సినిమాని ప్రకాష్ రాజ్ ఎంత వైవిధ్యంగా తెరకెక్కించినా.. దసరా కానుకగా ఓ నాలుగైదు సినిమాల మధ్య రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. హైపర్, ప్రేమమ్, ఈడు గోల్డ్ ఎహె, జాగ్వార్ ల మధ్య ప్రకాష్ రాజ్ సినిమా కొట్టుకుపోవడం ఖాయమనే కామెంట్స్ వినిపించాయి. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన ఊరి రామయణం’ ప్రేక్షకులని మెపించిందా.. ? మన ఊరి రామాయణం అసలు కథేంటో.. ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. ?

కథ :
ఊరిలో పేరుతో పాటు, పలుకుబడి ఉన్న ఓ పెద్ద మనిషి భుజంగయ్య (ప్రకాష్ రాజ్). ఆదర్శవంతమైన జీవితం గడపాలన్నదే భుజంగయ్య కోరిక. ఇందుకోసం సమాజంలో తన పరువు, ప్రతిష్టలకి ఏమాత్రం భంగం కలగకుండా కాలం వెల్లదీస్తుంటాడు. అయితే, ఓసారి తన కుటుంబంలో ఓ చిన్న గొడవపడి.. ఆ కోపంతో వాళ్ల ఊరిలోని ఓ వేశ్య (ప్రియమణి)తో సరదాగా గడిపేందుకు వెళతాడు. ఈ క్రమంలో.. అనుకోని పరిస్థితుల్లో వేశ్య ప్రియమణీతో కలసి తన ఇంటికి అతి సమీపంలో ఉన్న చిన్న కొట్టులో ఇరుక్కుపోతాడు. దీంతో.. తన పరువు బజారున పడటం ఖాయమని భుజంగయ్య కంగారు పడిపోతుంటాడు. చిన్న కొట్టులో వేశ్యతో ఇరుక్కుపోయిన భుజంగయ్య ఎలా బయటపడ్డాడు. తర్వాత తన పరువు,ప్రఖ్యాతలు పోకుండా.. వేశ్య ఘటన ఎవ్వరికితెలియకుండా భుజంగయ్య ఏం చేశాడన్నదే.. మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
* ప్రకాష్ రాజు
* కామెడీ ట్రాక్
* ఇళయరాజా సంగీతం

మైనస్ పాయింట్స్ :
* స్లో నేరేషన్
* ఎడిటింగ్
* ముందే ఊహించే కథ

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
ఇలాంటి పాయింట్‌తో కూడా సినిమా తీయొచ్చా.. ? అనుమానం కలగడం ఖాయం. చాలా చిన్న పాయింట్.. కానీ దాంట్లోనే మనషుల భావోద్వేగాలు, సంఘర్షణ, జీవితాన్ని చూసే కోణం వీటి మధ్య సన్నివేశాల్ని అల్లుకొన్నారు. ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచే సన్నివేవేశాలు కట్టిపడేస్తాయి. వీరి మధ్య నడిచే సన్నివేశాలు చిన్న గదిలో తీశారు. దాదాపు సగం సినిమా ఇక్కడే నడుస్తుంది. అయితా ఏ మాత్రం బోర్ రాదు. ప్రకాష్ రాజ్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది.. జీవించేశాడు. అయితే, ప్రియమణీ గురించి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఈ సినిమా మొత్తం నాలుగు పాత్రల చుట్టూనే నడుస్తుంది. ఈ నాలుగు పాత్ర దారులు అద్భుతంగా చేశారు.

సాంకేతికంగా :
దర్శకుడిగా, నటుడిగా ప్రకాష్ రాజ్ తనది ప్రత్యేక శైలి అని మరోసారి నిరూపించుకున్నారు. ఒక నూలు పోగులాంటి కథాంశానికి.. మంచి ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే రాసుకొని రచయితగా ప్రకాష్ రాజ్ బాగా ఆకట్టుకున్నారు. ఫస్ట్ ఎప్పుడూ అయిపోయిందో తెలిదు. అంత బాగా ఉంది మొదటి భాగం. అయితే, ద్వితీయార్థం కాస్త సాగదీతలా అనిపిస్తోంది. ఇళయరాజా బ్యాంక్‍గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలోని అసలైన ఎమోషన్ స్థాయిని పెంచేలా ఇళయరాజా అందించిన స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ న్యాచురల్‌గా బాగుంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలకి కత్తెర పెడితే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే వారు ‘మన ఊరి రామాయణం’ బెస్ట్ ఛాన్స్. అంతేకాదు.. కామెడీ, ఫ్యామీలీ సినిమాలు ఇష్టపడే వారిని కూడా ప్రకాష్ రాజ్
ఈ సినిమా ద్వారా మెప్పిస్తాడు.

బుల్లెట్ పాయింట్ : మన ఊరి రామాయణం.. మనసుకి హత్తుకునే సినిమా
రేటింగ్ : 3.5/5

SHARE