మ‌న‌లో ఒక‌డు మూవీ రివ్యూ…

 Posted November 4, 2016

manalo okkadu movie reviewచిత్రం : మ‌న‌లో ఒక‌డు (2016)
నటీనటులు : ఆర్పీ పట్నాయక్, అనిత
సంగీతం : ఆర్పీ పట్నాయక్
దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్
నిర్మాత : గురజాల జగన్‍మోహన్
రిలీజ్ డేట్ : 4నవంబర్, 2016.

సంగీత దర్శకుడు.. ఓ సినిమాకి దర్శకుడు అయితే..ఆ సినిమాలో సంగీత పరిమళాలు విరజిమ్ముతాయని అనుకొంటాం. అయితే, ఆర్పీమాత్రం సాజిమాజిక అంశాలపై గురిపెట్టాడు. మెగా ఫోన్ తో పట్టి అందమైన మనసులు, బ్రోకర్, ఫ్రెండ్ బుక్,తులసీ దళం చిత్రాలు తీశాడు. ఆయన తాజా చిత్రం ‘మనలో ఒకడు’. ఇది మీడియాపై ఆర్పీ ఎక్కుపెట్టిన బాణం. పాజిటివ్ టాక్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మనలో ఒకడు ‘ ఏం చేశాడు.. ? అతడి కథేంటీ.. ??
తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
కృష్ణమూర్తి (ఆర్పీ పట్నాయక్) ఓ నిజాయితీ గల ప్రొఫెసర్.కష్టపడి చదివి ప్రొఫెసర్ వృత్తిలో స్థిరపడిన కృష్ణమూర్తి భార్య అనిత (అనిత)తో కలసి హ్యాపీగా జీవితం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో మీడియా చేసిన ఒక తప్పువల్ల కృష్ణమూర్తి అప్రతిష్ట పాలవుతాడు.సమాజంలో తలెత్తుకోని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణమూర్తి ఏం చేశాడు.. ? తన నిజాయితీని ఎలా నిరూపించుకొన్నాడు.. ?? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* కథ
* ఎమోషన్స్‌
* ఫస్టాఫ్‌
* ఆర్పీ – అనిత

మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాప్
* సాగదీత
* పాటలు

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
సహజత్వానికి దగ్గరగా ఉండే కథ ‘మనలో ఒకడు’. అంతే సహజంగా ఈ కథని చెప్పాడు ఆర్పీ. ఎలాంటి హడావుడి లేకుండా కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో సగం సక్సెస్ అయ్యాడు కూడా. ఎందుకంటే.. ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగింది.సెకాంఢాఫ్ మాత్రం ఒడిదుడుకులకి లోనైంది. దీంతో.. మనలో ఒకడు మామూలు సినిమాగా మిగిలిపోయింది. సెకాంఢాప్ కూడా ఇంకాస్త బాగుంటే మనలో ఒకడు రిజల్ట్ ఇంకో రేంజ్ లో ఉండేది. ఎమోషనల్ సన్నివేశాలని ఆర్పీ బాగా రాసుకొన్నాడు. ఇక, నటుడిగా కూడా ఆర్పీ ఆకట్టుకొన్నాడు. చాన్నాళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన అనిత తన పాత్రలో ఒదిగిపోయింది. మిగితా నటీనటులు కూడా తమ తమ పరిథి మేరకు నటించారు.

సాంకేతికంగా :
ఓ సాధారణ వ్యక్తి తనకి జరిగిన అన్యాయంపై మీడియాపై చేసే పోరాటమే‘మనలో ఒకడు’.ఇందుకోసం బలమైన  కథ, స్క్రీన్ ప్లేని రాసుకొన్నాడు ఆర్పీ.కొన్ని చిన్న చిన్న లోపాలని సరిచేసుకుంటే మనలో ఒకడు మంచి చిత్రంగా నిలబడే అన్నిఅర్హతలు కలిగివున్నదే. ఆర్వీ సంగీత దర్శకుడు అయి  ఉండి కూడా మంచి పాటలని అందించలేకపోయాడు. ఇది ఆర్పీ చేసిన అతిపెద్ద తప్పు. అయితే,నేపథ్య సంగీతంలో మాత్రం తనదైన మార్క్ చూపించాడు. సినిమాఫోటోగ్రఫీబాగుంది.కొన్ని చోట్ల సినిమాకి కత్తెరపెట్టొచ్చు. నివిడి ప్రేక్షకులని ఇబ్బంది పెట్టేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
ఈరోజు రిలీజైన 9కిపైగా సినిమాలో మనలో ఒక్కడు చాల బెటర్. హీరో-హీరోయిన్ అనే లెక్కలు వేసుకోకుండా.. కథా బలమున్న సినిమాలు ఇష్టపడే వారికి ‘మనలో ఒకడు’ బాగా నచ్చేస్తుంది.

బాటమ్ లైన్ : మనలో ఒకడు.. మాములోడు కాదు..
రేటింగ్ : 2.5/5

SHARE