“మనం” ఇక సినిమా మాత్రమే కాదు…అంతకు మించి

108

 Posted [relativedate]

manam is not only movie its a banner
అక్కినేని కుటుంబంలో మూడు తరాలు నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రం “మనం”. నటనా రంగంలో ఆ కుటుంబానికి మూలపురుషుడైన అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రం కూడా అదే కావడంతో నాగ్ అండ్ ఫ్యామిలీ కి ఆ సినిమా వెరీ వెరీ స్పెషల్.మనం తోనే పెద్దయ్యాక వెండితెరపై మెరిసిన అఖిల్ తర్వాత సినిమా మొదలైంది.ఆ సినిమాని తండ్రి నాగార్జున నిర్మిస్తున్నాడు.అయితే అన్నపూర్ణ స్టూడియోస్,గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కాదు.మనం ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఈ కొత్త సినిమా తీయబోతున్నారు.

మనం సినిమాని డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ అఖిల్ తాజా సినిమాకి కూడా దర్శకుడు. ఇక ఆ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు చాలా మంది ఈ సినిమాకి కూడా పని చేస్తున్నారు. ఆ సెంటి మెంట్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమాని గుర్తు చేసుకునేందుకు వీలుగా నాగ్ కొత్తగా మనం ఎంటర్ ప్రయిసెస్ అనే ఈ కొత్త బ్యానర్ కి రూపకల్పన చేశారు.ఏదేమైనా ఓ సినిమా పేరుకి బ్యానర్ వేల్యూ కల్పిస్తూ టాలీవుడ్ లో ఇంకో కొత్త పద్ధతికి నాగ్ ట్రై చేయడం విశేషం. ఇంతకుముందు “చిత్రం ” తో దర్శకుడిగా పరిచయమైన తేజ కూడా అదే పేరుతో బ్యానర్ నెలకొల్పిన విషయం తెలిసిందే ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here