మనమంతా ప్రివ్యూ..

0
600

Manamantha--Movie-Pre-Revie

చిత్రం : మనమంతా (2016)
నటీనటులు : మోహన్ లాల్, గౌతమి, విశ్వంత్, రైనా రావు, అనిషా ఆంబ్రోస్, తారక రత్న
సంగీతం : మహేష్ శంకర్
దర్శకుడు : చంద్రశేఖర్ యేలేటి
బ్యానర్ : వారాహి చలనచిత్రం
నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి

సాహసం చేసే దర్శకుడు “చంద్రశేఖర్ ఏలేటి”. ‘ఐతే’ చిత్రం నుంచి ఆయన సాహసం కొనసాగుతూనే  ఉంది. ఐతే నుంచి గోపీచంద్ తో చేసిన ‘సాహాసం’ వరకు ఆయన తీసిమాలన్నీడిఫరెంట్ జోనర్ లో తెరకెక్కినవే. తాజాగా, ఆయన చేస్తోన్న మరో సాహాసం “మనమంతా”. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. నలుగురు వేరు వేరు వ్యక్తులకు సంబందించిన ఎమోషనల్ జర్నీ..ఒక పాయింట్ వద్ద  ఎలా కలుస్తాయి అనేదే.. మనమంతా సినిమా స్టోరీ. కథ, కథనంలో యేలేటి తనదైన మార్క్ తో తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, మళయాళంలోనూ ఈ సినిమాని తీసుకొచ్చారు. యేలేటి కథకి మోహన్ లాల్ వంటి స్టార్ తోడవ్వడంతో మనమంతాకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. మోహన్ లాల్ కి జంటగా గౌతమి జతకట్టనుంది. ఈ క్రేజి ఫ్యామిలి ఎంటర్టైనర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. చంద్రశేఖర్ యేలేటి చేసిన సాహసం మళ్లీ ఫలిచిందా.. ? మోహన్ లాల్ క్రేజ్ ‘మనమంతా’ చిత్రాన్ని ఏ రేంజ్ లో నిలబెట్టింది. మొత్తానికి మనమంతా.. ప్రేక్షకులనంతా ఆకట్టుందా.. ?? అన్నది మరికొద్ది గం॥ల్లో తెలియ ఉన్నది. ఈలోపు మనమంతా విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ

ప్రివ్యూ :
* నలుగురు వేరు వేరు వ్యక్తులకు సంబందించిన ఎమోషనల్ జర్నీ.. మనమంతా.
* దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎప్పుడూ సాహసాలు చేస్తాడు
* ఈసారి యేలేటి సాహసమే చేస్తున్నాడు.. కానీ.. ఈ సారి తన సాహసానికి స్టార్ హీరో మోహన్ లాల్ తోడవ్వటం ప్రధాన బలం
* ఓ ప్రయోగానికి ఓ స్టార్ హీరో కలిస్తే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందన్నది మనమంతా రుజువు చేయాల్సి ఉంటుంది.
* తెలుగు, తమిళ్, మళయాళంలోనూ ఒకేసారి రానుండటం ‘మనమంతా’కి కలిసొచ్చే అంశం
* మోహన్ లాల్ పాత్రని మరెవ్వరూ చేయలేరని దర్శకుడు చెబుతున్నాడు
* మోహన్ లాల్ చేసిన పాత్ర చాలా బలమైంది, రియలిస్టిక్ గా కూడా ఉంటుందట.
* చంద్రశేఖర్ యేలేటి చేసిన సినిమాల్లో ఇదే కష్టమైన సినిమా అంటున్నారు
* ఇందులో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే బలమైన భావోద్వేగాలు ఉంటాయట.
* క్లైమాక్స్ లో వచ్చే 15 నిముషాల సినిమా, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని కట్టిపడేస్తాయని చిత్రబృందం చెబుతోంది.
*  మొత్తానికి.. “మనమంతా” మనసుల్ని తాకే సినిమా అని భరోసా ఇస్తుంది చిత్రబృందం.

మరి.. నిజంగా ‘మనమంతా’ మనసుల్ని తాకే సినిమాగా నిలుస్తుందా.. ? ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి. మీ తెలుగుబుల్లెట్ డాట్ కామ్.

Leave a Reply