వర్మ మీద వంగవీటి రణరంగం ?

0
432
manchala sai sudhakar to do ranarangam movie about vangaveeti ranga

Posted [relativedate]

manchala sai sudhakar to do ranarangam movie about vangaveeti ranga
వంగవీటి పేరుతో వర్మ తీసిన సినిమా ఎంత రచ్చ చేసిందో చూశాం.రంగాని వర్మ ఆ సినిమాలో చూపించిన విధానం నచ్చని వాళ్ళు ఎన్నో విమర్శలు చేశారు.అలాంటి విమర్శలు చేసిన వాళ్లకి జవాబిస్తూ నాకు తెలిసింది,నాకు నచ్చింది చేశా..అది నచ్చని వాళ్ళు తమకి తెలిసినట్టు ఇంకో సినిమా తీసుకోవచ్చు అనేసిన విషయం అందరికీ తెలిసిందే.పైగా దానికి నిజమైన వంగవీటి అని పేరు కూడా పెట్టుకోవచ్చు అని సలహా ఇచ్చాడు.ఆ సలహా పాటించారో ..లేక ఇంకో సినిమా తీసుకోమన్న సవాల్ స్వీకరించారో గానీ వంగవీటి రంగా కథతో ఓ సినిమా తీయడానికి రంగం సిద్ధమైంది.ఆ సినిమా పేరు రణరంగం.

నెంబర్ 1 టీవీ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.తుని విధ్వంసం కేసులో విచారణ ఎదుర్కొన్న ఈయన ఈ సినిమా తలపెట్టినా నేరుగా అది రంగా చరిత్ర అని చెప్పకుండా విజయవాడలోని ఓ ప్రజా నాయకుడి జీవిత చరిత్ర తీస్తున్నట్టు వివరిస్తున్నారు. మరుధూరి రాజా లాంటి ప్రముఖ రచయిత ఈ సినిమాకి పని చేస్తున్నారు.మొత్తానికి రణతంగం ప్రకటనతో ఇంకోసారి వంగవీటి,వర్మ అందరి మదిలో మెదులుతున్నారు.

Leave a Reply