శివరాత్రికి పేలనున్న లక్ష్మీ బాంబ్..!!

0
498
manchu lakshmi bomb at sivaratri

Posted [relativedate]

manchu lakshmi bomb at sivaratriమంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాల కృష్ణ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీ బాంబ్. ఈ లక్ష్మీబాంబ్ శివరాత్రికి  పేలనుంది. కామెడి థ్రిల్లర్  కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో  మంచు లక్ష్మీ జడ్జి పాత్రలో మెరవనుంది. నిజానికి గతేడాది దీపావళి కంటే ముందే ఈ బాంబ్ ను పేల్చుదామనుకుంది లక్ష్మి. అయితే నోట్ల రద్దు, ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాలు ఉండడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమాను శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. మహిళల సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని రూపొందిన లక్ష్మీ బాంబ్ మరి పేలుతుందో తుస్సుమంటుందో చూడాలి. 

 

Leave a Reply