Posted [relativedate]
మంచు లక్ష్మి ప్రముఖ దర్శకుడు వంశీ తీస్తున్న ” ఫ్యాషన్ డిజైనర్ ” చిత్రానికి సంబంధించిన సినిమా పోస్టర్ పై తన అసహనాన్ని వ్యక్తం చేసింది. సుమంత్ అశ్విన్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ మొన్ననే రిలీజ్ అయింది .వంశీ దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన లేడీస్ టైలర్ సినిమా కి సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ రాబోతుంది. ప్రీ లుక్ పోస్టర్ లో హీరో హీరోయిన్ ఎత్తులను కొలతలు తీస్తున్నట్టుగా డిజైన్ చేసారు. ఆ పోస్టర్ లో ఇదే హైలైట్ అయింది.దానితో ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.కానీ ఈ ప్రీ లుక్ పై మంచు లక్ష్మి కొంచెం ఘాటు గా స్పందించింది. ఆడవారిని అలా అభ్యంతరకరంగా చూపించడం ఏమిటి ..ఇలాంటి వాటిని ఇంకెప్పుడు ఆపుతారని సినిమా నిర్మాత మధుర శ్రీధర్ కి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.మంచు లక్ష్మి లేవనెత్తిన అంశంపై చిత్ర దర్శక నిర్మాతలు ఎవరు ఇంకా ఏమి స్పందించలేదు.
ఫ్యాషన్ డిజైనర్ మూవీని మాస్ మహారాజ్ రవితేజతో లేదా యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చేయాలని వంశీ భావించాడు. కాని ఫైనల్ గా సుమంత్ అశ్విన్ హీరోగా అవకాశం దక్కడం విశేషం .రాజేంద్రప్రసాద్ హీరో గా నటించిన లేడీస్ టైలర్ మూవీ అప్పట్లో ఘన విజయం సొంత చేసుకుంది.ఈ మధ్య సరైన హిట్స్ లేక దర్శకుడు వంశీ కొంచెం టాప్ డైరెక్టర్స్ లిస్టు లో వెనుకబడ్డాడు. ఈ సినిమా ని ఎలా హిట్ కొట్టి తన కెరీర్ ని గాడిలో పెట్టాలని ఎదురు చూస్తున్నాడు.